: ఒత్తిడి కోహ్లీపైనే.. మాపైన లేదు!: నాథన్ లియాన్
ఈనెల 16న రాంచీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఒత్తిడంతా విరాట్ కోహ్లీ సేనపైనే ఉందని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ తెలిపాడు. నాలుగు టెస్టుల బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రెండు జట్లు చెరి ఒక టెస్టు నెగ్గి సమఉజ్జీలుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీనిపై లియాన్ మాట్లాడుతూ, సొంత గడ్డపై ఆడుతున్న కోహ్లీపైనే ఒత్తిడి ఉంటుందని అన్నాడు. సిరీస్ లో లీడ్ సాధించాలంటే తమపై నెగ్గాలని, అందుకు టీమిండియా శ్రమించాలని అన్నాడు. టీమిండియాలో ప్రతి ఆటగాడికి తాము ప్రత్యేక ప్రణాళిక సిద్ధంగా ఉంచామని చెప్పాడు. గాయం కారణంగా మార్ష్, స్టార్క్ దూరమైనా ఆసీస్ కు సరిపడా వనరులున్నాయని అన్నాడు. స్టార్క్ స్థానాన్ని భర్తీ చేసేందుకు యువకులు సిద్ధంగా ఉన్నారని లియాన్ చెప్పాడు.