: హోలీ రంగులతో నిండిపోయిన టీవీ యాంకర్ శ్రీముఖి ముఖం.. ఫొటోలు!
హోలీ రంగులతో టీవీ యాంకర్, సినీ నటి శ్రీముఖి ముఖం నిండిపోయింది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వెండితెర, బుల్లితెర ప్రముఖులు తాము జరుపుకుంటున్న హోలీ సంబరాల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి వదులుతుందా? తన ట్విట్టర్‌లో ఖాతాలో ఆమె తీసుకున్న కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖం నిండా హోలీ రంగులతో ఎవ్వరూ గుర్తుపట్టలేని విధంగా ఉంది. మొత్తం మూడు ఫొటోలను ఈ అమ్మడు ట్విట్టర్‌లో ఉంచగా, వాటిలో రెండు రంగు రంగుల ముఖాలే ఉన్నాయి. అందులోని ఓ ఫొటో మాత్రం ఆమె చక్కగా ముఖం కడుక్కున్నాక తీసిన ఫొటోలా ఉంది. అందరికీ హ్యాపీ హోలీ అని ఆమె పేర్కొంది. బుల్లితెరపై చకచకా మాట్లాడుతూ, తన అందంతో కట్టిపడేస్తోన్న శ్రీముఖికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే.
Happy Holi everyone! #HappyHoli