: తన దగ్గర అక్రమాస్తులు లేవని సోమిరెడ్డి ప్రమాణం చేస్తే...రాజీనామా చేస్తా: కాకాని


టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ నేత కాకాని గోవర్థన్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర అక్రమాస్తులు లేవని దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తే ఆయన కోరుకున్నట్టు తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను పదేపదే విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని సోమిరెడ్డి ఆశపడుతున్నట్టు ఉన్నారని ఆయన చురక అంటించారు. జగన్ ను తిడితే మంత్రి పదవులు రావని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News