: శివాజీ రావు గైక్వాడ్ కు రజనీకాంత్ గా నామకరణం చేసింది ఈరోజే!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాక ముందు ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్  ఆ పేరుకు బదులు రజనీకాంత్ గా నామకరణం చేసింది ఈ రోజే ..అంటే హోలీ పండగ నాడే. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ ఓ సందర్భంలో చెప్పారు. 2010లో తమిళనాడు డైరెక్టర్స్ అసోసియేషన్ చెన్నైలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి అతిథులుగా దర్శకుడు బాలచందర్, రజనీకాంత్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వారి మధ్య సంభాషణ ఇలా కొనసాగింది ..

‘నేను, నీకు రజనీకాంత్ అని నామకరణం చేసింది ఎప్పుడో గుర్తుందా?’ అని బాలచందర్ ప్రశ్నించగా, ‘నాకు బాగా గుర్తుంది. ఆ రోజు పౌర్ణమి. హోలీ పండగ’ అని ఠక్కున రజనీ సమాధానమిచ్చారట. ‘హోలీ పండగ రోజు నన్ను ఎప్పుడూ కలుస్తూ ఉండే వాడివి. కలిసేందుకు వీలు లేకపోతే, కనీసం, ఫోన్ అయినా చేస్తుండే వాడివి. ఇప్పుడు, అవేవీ లేవు’ అని రజనీకాంత్ తో బాలచందర్ సరదాగా అనడంతో, ఆయనకు రజనీ క్షమాపణలు చెప్పి, బిజీ గా ఉండటంతో తాను మర్చిపోయానని అన్నారట. దీనికి బాలచందర్ స్పందిస్తూ, ‘నేనెప్పుడూ మర్చిపోలేదు. హోలి గురించి వార్తా పత్రికల్లో ఎప్పుడు చదివినా, నీ లాంటి సూపర్ స్టార్ ని సినీ రంగానికి పరిచయం చేసినందుకు ఎంతో గర్వపడుతుంటాను’ అని అన్నారు.

  • Loading...

More Telugu News