: స్మిత్, కోహ్లీలపై చర్యలు తీసుకోకుండా ఎలా వదిలేస్తారు?: ఐసీసీని ప్రశ్నించిన సౌతాఫ్రికా క్రికెటర్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్ డుప్లెసిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గతంలో తాను బాల్ ట్యాపరింగ్ కు పాల్పడ్డానంటూ కఠిన చర్యలు తీసుకున్న ఐసీసీ స్మిత్, కోహ్లీలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వారితో పోల్చుకుంటే తాను చేసిన తప్పు పెద్దది కాదని చెప్పాడు. స్మిత్, కోహ్లీలు నిబంధనలు అతిక్రమించినప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంటారని ప్రతి క్రికెటర్ భావించాడని, మరి వారిద్దరిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటని ప్రశ్నించాడు. అయితే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇలాంటి వివాదాలు సర్వసాధారణమని డుప్లెసిస్ పేర్కొన్నాడు.