: జైట్లీకి అదనంగా రక్షణ శాఖ బాధ్యతలు!


కేంద్ర రక్షణ శాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గోవా ముఖ్యమంత్రిగా ఆయన పదవీబాధ్యతలను స్వీకరించబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవికి పారికర్ చేసిన రాజీనామాకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. త్వరలోనే అత్యంత కీలకమైన రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించనున్నారు.  

  • Loading...

More Telugu News