: పనాజీలో హోలీ సంబరాల్లో మనోహర్ పారికర్


గోవాకు కాబోయే ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ హోలీ సంబరాలు జరుపుకున్నారు. పనాజీలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ మాట్లాడుతూ, గోవా సీఎం గా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరు కానున్నట్లు చెప్పారు. కాగా, కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్న పారికర్ ఈ రోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. గోవా సీఎం గా పారికర్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పదిహేను రోజుల్లోపు ఆయన బల నిరూపణ చేసుకోవాలని గోవా గవర్నర్ మృదుల సిన్హా ఆదేశించారు.

  • Loading...

More Telugu News