: లాలూ స్టయిలే వేరు.. హోలీ సంబరాలలో పాట పాడిన వైనం!


హోలీ సంబరాలు అనగానే రంగులు గుర్తుకొస్తాయి. ఎవరైనా రంగులు చల్లుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. కామునిదహనంతో వేడుకలకు ముగింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా ఈ సంబరాలను అభిమానులతో కలసి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాదిలో చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ వేడుకల్లో పాల్గొంటారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా హోలీ వేడుకల్లో హల్ చల్ చేశారు. సాధారణంగా రంగులు పూసుకుని వేడుకలు జరిపే లాలూ, ఈ ఏడాది ఓ అడుగు ముందుకేసి పాట కూడా పాడారు. దీంతో ఆయన అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ హోలీ సంబరాల్లో బీజేపీ ఎంపీ, భోజ్ పురీ ప్రముఖ నటుడు మనోజ్ తివారీ కూడా పాల్గొనడం విశేషం. 

  • Loading...

More Telugu News