: కాంగ్రెస్ తో చేతులు కలపడమే అఖిలేష్ ఓటమికి కారణం!: బీజేపీ నేత రాహుల్ సిన్


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఈ సందర్భంగా అఖిలేష్ ఘోర ఓటమికి కారణాలేంటో బీజేపీ నేత రాహుల్ సిన్హా విశ్లేషించి చెప్పారు. కాంగ్రెస్ తో సమాజ్ వాదీ పార్టీ జతకట్టడమే అతి పెద్ద తప్పని ఆయన అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలపకపోయినప్పటికీ అఖిలేష్ యాదవ్ ఓడిపోయేవారని... కాకపోతే ఆ ఓటమి ఇంత దారుణంగా ఉండేది కాదని చెప్పారు. ప్రజలంతా సరికొత్త భారత్ కు మద్దతుగా నిలిచారని... ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తాము ఘన విజయం సాధించామని తెలిపారు. 

  • Loading...

More Telugu News