: విజయవాడలో తల్లీకొడుకులపై దాడి.. పరిస్థితి విషమం
విజయవాడలోని కేదారేశ్వరపేటలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతం గుండా బైకుపై వెళుతోన్న తల్లీకొడుకులపై పలువురు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితులిద్దరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులను గుర్తించే పనిలో ఉన్నారు. ఆ దాడికి కుటుంబ తగాదాలే కారణమా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. అక్కడి ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.