: హోలీ పేరుతో అలా ప్రవర్తించిన వారే సిగ్గుపడాలి!: బాలీవుడ్ నటి షెనాజ్
హోలీ పేరుతో పలువురు చేసే చేష్టలు అసభ్యకరంగా ఉంటాయని ప్రముఖ బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీవాలా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా తనకు చేదు అనుభవం ఎదురైందని చెప్పింది. ఇది హోలీ అంటూ ఎక్కడెక్కడో చేతులు వేస్తుంటారని ఆమె మండిపడింది. అందుకే హోలీనాడు తనకు భద్రతగా అనిపించదని తెలిపింది. హోలీ పేరుతో తనను చాలా ఇబ్బందికరంగా గతంలో తడిమి చూశారని, అందుకే తానెప్పుడూ హోలీ కోసం అంత ఉత్సాహంగా ఎదురుచూడనని చెప్పింది. అయితే, ఈ విషయం చెప్పడానికి తానేమి సిగ్గుపడటం లేదని పేర్కొంది. తనపై అలా ప్రవర్తించిన వారే సిగ్గుపడాలని చెప్పింది. ఇష్క్ విష్క్ అనే సినిమాలో అలీషా అనే పాత్రతో ఈ ముద్దుగుమ్మ కనిపించిన విషయం తెలిసిందే.
I don't feel safe on Holi, I've been inappropriately touched by men with the excuse of "Holi Hain". So, sorry if... https://t.co/DxtS0y9gR1
— Shenaz Treasury (@ShenazTreasury) March 13, 2017