: తెలంగాణ బడ్జెట్ స్పెషల్... 30 వస్తువులతో 'కేసీఆర్ కిట్‌'


రాష్ట్రంలో జరిగే అన్ని ప్రసవాలూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగేలా చూడాలన్న లక్ష్యంతో, మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ, 'కేసీఆర్ కిట్' పేరిట గర్భిణీలకు ఓ కిట్ ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 30 వస్తువులుండే ఈ కిట్ లో చిన్న పిల్లలకు మూడు నెలలకు సరిపడా వస్తువులు ఉంటాయి. ఈ కిట్‌ లో బేబీ హెయిర్ ఆయిల్, బేబీ బాడీ ఆయిల్, బేబీ పౌడర్, పౌడర్ పువ్వు, మస్కిటో కిట్, బేబీ షాంపూ, పాల బాటిల్, న్యాపీలు, చొక్కాలు, నిక్కర్లు, టవల్, చిన్న బెడ్‌.. ఇలాంటివన్నీ ఉంటాయి. బాలింతలకు అవసరమయ్యే వివిధ వస్తువులు కూడా ఉంటాయి. ఇక ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు పరీక్షలు పూర్తి అయిన తరువాత, ప్రసవం అయిన తర్వాత, బిడ్డకు టీకాలు వేయించిన తరువాత.. ఇలా మూడు విడతలుగా ఆర్థిక సహాయం కూడా చేయనున్నట్టు ఈటల ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News