: రక్షణ శాఖ మంత్రి పదవికి మనోహర్ పారికర్ రాజీనామా


గోవాలో బీజేపీపై తగ్గిన ప్రజాభిమానాన్ని తిరిగి చూరగొనడమే లక్ష్యంగా ఆ రాష్ట్రానికి సీఎంగా పనిచేసేందుకు వెళ్లనున్న మనోహర్ పారికర్, రక్షణ శాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం తన రాజీనామా లేఖను ఆయన ప్రధాని కార్యాలయానికి పంపారు. గోవా  చేరుకున్న ఆయన, రేపు సాయంత్రం 5 గంటలకు గోవాకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఆయనతో పాటు కొందరు మంత్రులు సైతం ప్రమాణం చేయనున్నారు. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవా అసెంబ్లీలో 17 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించినా, బీజేపీ వేసిన ఎత్తుల ముందు చిత్తయింది. 13 చోట్ల మాత్రమే గెలిచిన బీజేపీ, ముగ్గురేసి సభ్యులున్న గోవా ఫార్వర్డ్ పార్టీ, ఎంజీపీలను దగ్గర చేర్చుకోవడంతో పాటు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు పొంది, అధికారానికి దగ్గరైంది.

  • Loading...

More Telugu News