: దయచేసి మూగజీవాల పట్ల జాగ్రత్త వహించండి: హోలీ సందర్భంగా కోహ్లీ వీడియో సందేశం


హోలీ పండుగ సంద‌ర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ త‌న‌ అభిమానులకు ట్విట్ట‌ర్ ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు. దయచేసి మూగజీవాల పట్ల జాగ్రత్త వహించండని ఆయ‌న కోరారు. హోలీ సంద‌ర్భంగా మూగ‌జీవులకు హాని క‌లుగ‌కుండా జాగ్ర‌త్తవ‌హించాల‌ని ఆయ‌న అన్నాడు.

అంతకుముందు కూడా మ‌రో పోస్ట్ చేసిన కోహ్లీ.. అందులో సీఐఎస్‌ఎఫ్‌పై ప్ర‌శంస‌లు గుప్పించాడు. ఇటీవలే సీఐఎస్‌ఎఫ్‌ 48వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా తాను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి దిగిన ఓ ఫొటోని ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఉంచాడు. త‌న‌ విమాన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా జరిగేందుకు సహాయమందిస్తోన్న సీఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యాలయానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. చివర్లో జైహింద్ అని కోహ్లీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News