: బండ్ల గణేష్ బిజినెస్ పై బీజేపీ ఎఫెక్ట్!


చిన్న చిన్న వేషాలతో సినీ జీవితాన్ని ప్రారంభించి, బడా నిర్మాతగా ఎదిగాడు బండ్ల గణేష్. ఇదే సమయంలో, తెలంగాణలోని పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఆయన నంబర్ వన్ గా నిలిచాడు. తొలుత రెండు వేల కోళ్లతో ప్రారంభించిన వ్యాపారం కాస్తా... ఇప్పుడు పాతిక లక్షల కోళ్లకు విస్తరించింది. తన వ్యాపార ప్రస్థానంలో, పౌల్ట్రీ బిజినెస్ ను ఉత్తరప్రదేశ్ కు కూడా విస్తరించేందుకు బండ్ల గణేష్ యత్నించాడు. అక్కడ పౌల్ట్రీ ఫామ్ లు పెట్టేందుకు 100 ఎకరాల భూమిని కూడా సిద్ధం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ తనకు తక్కువ ధరకే ఈ భూమిని కేటాయించారని బండ్ల తెలిపాడు.

దీని కోసం తనకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహకరించారని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అఖిలేష్ ముఖ్యమంత్రి అయితేనే అక్కడ పౌల్ట్రీ పెడతానని అన్నాడు. ఒకవేళ అఖిలేష్ ఓడిపోతే ఏం చేస్తారని ప్రశ్నిస్తే... ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన గెలిచిన తర్వాత పెడతానని చెప్పాడు. అయితే, ఇప్పుడు అక్కడ సమాజ్ వాదీ పార్టీ ఓటమి పాలైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో, బండ్ల గణేష్ వ్యాపార విస్తరణ ప్రస్తుతానికి ఆగిపోయినట్టే.  

  • Loading...

More Telugu News