: కుట్ర పూరిత హత్యే: కేంద్ర మంత్రి
పాకిస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోమాలోనే తుదిశ్వాస విడిచిన సరబ్ జిత్ సింగ్ ది కుట్ర పూరిత హత్యగానే పరిగణిస్తున్నామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ అన్నారు. ఉద్దేశ పూర్వకంగానే సరబ్ ను హ్యత చేసినట్లు భావిస్తున్నామని చెప్పారు. సరబ్ ను మానవీయ కోణంలో విడుదల చేయాలని 15 నెలల కిందటే పాక్ ప్రధానిని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారని మనీష్ వెల్లడించారు. విదేశీ ఖైదీల పట్ల వ్యవహరించే విధానంలో పాక్ తీరు సరిగ్గా లేదని అసహనం వ్యక్తం చేశారు. దీనినిబట్టి జెనీవా ఒప్పందాలను పాక్ ఉల్లంఘించినట్లు అర్ధమవుతోందన్నారు. కాగా, సరబ్ జిత్ వ్యవహారాన్ని రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తివారీ ఆరోపించారు.