: విద్యార్థులు డిస్టర్బ్ అవుతున్నారని 'గే' ప్రొఫెసర్ కు ఉద్వాసన పలికిన బెంగళూరు కాలేజ్


తనను తాను 'గే'గా ప్రకటించుకుని, స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న బెంగళూరు సెయింట్ జోసఫ్ కాలేజ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆష్లే టెల్లిస్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కాలేజీ యాజమాన్యం ప్రకటించింది. ఆయన వ్యక్తిగత అభిప్రాయాలతో విద్యార్థులు డిస్టర్బ్ అవుతున్నారన్న కారణాన్ని చూపుతూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు తెలిపింది.

"మార్చి 9న నేను బీకామ్ రెండో సంవత్సరం విద్యార్థులకు పాఠం బోధిస్తున్నాను. కాలేజీ ప్రిన్సిపాల్ విక్టర్ లోబోను తక్షణం కలుసుకోవాలని నాకు సమాచారం వచ్చింది. నేను క్లాస్ ను మధ్యలో వదిలి ఆయన కార్యాలయానికి వెళ్లాను. పది నిమిషాల పాటు వెయిట్ చేయించిన ఆయన, ఆపై, అసలు విషయాన్ని చెప్పారు. తక్షణమే తనను తొలగిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు పాఠాలు విని డిస్టర్బ్ అయితేనే ప్రపంచాన్ని మార్చగలుగుతారు. అసలు డిస్టర్బ్ అయితేనే కొత్త ఆలోచనలు వస్తాయి. అదే నిజమైతే, నన్నెలా తొలగిస్తారు?" అని ఆయన తన సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

కాగా, ప్రొఫెసర్ తొలగింపుపై కాలేజీ యాజమాన్యం సైతం స్పందించింది. ఆయన్ను ఆరు నెలల తాత్కాలిక కాంట్రాక్టుపై నవంబర్ 2016లో నియమించామని, ఆయన పరిజ్ఞానంపై తమకు సందేహాలు లేవని, అయితే, సున్నిత అంశాలను చర్చకు తేవడం ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలపై మనసును లగ్నం చేయలేకపోతున్నారని తెలిసిన మీదటే, ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News