: హైదరాబాద్‌లో నోట్ల మార్పిడి ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్!
బ్యాంకుల్లో పాతనోట్లను మార్చుకునే గడువు ముగిసినప్పటికీ ఇంకా పాతనోట్ల మార్పిడి అనధికారికంగా జరుగుతూనే ఉంది. హైదరాబాద్‌లో ఈ దందా జోరుగానే కొనసాగుతోంది. ఇలా పాతనోట్లు మార్చుతున్న ఓ ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఈ రోజు నగరంలోని బంజారాహిల్స్‌లో దాడులు జరిపి 10 మంది కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.5 కోట్ల రద్దయిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆ నోట్లను కొత్తనోట్లతో ఎక్కడ మార్చుకుంటున్నారన్న విషయం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.