: మాకు చెక్ పెట్టడానికి అమెరికా, జపాన్ కుట్ర.. దీని కోసం భారత్ ను వాడుకుంటున్నాయి: చైనా ఆరోపణ
తమను కట్టడి చేసేందుకు అమెరికా, జపాన్ లు యత్నిస్తున్నాయని చైనా తీవ్ర ఆరోపణలు చేసింది. దీని కోసం భారత్ ను వినియోగించుకునేందుకు యత్నిస్తున్నాయని తెలిపింది. అమెరికా, జపాన్ ల ఉచ్చులో అనవసరంగా చిక్కుకోవద్దని భారత్ ను కోరింది. అమెరికా, జపాన్ ల ఉచ్చులో పడితే భారత్ కే ఎక్కువ ముప్పు ఉంటుందని... అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని హెచ్చరించింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ మేరకు ఓ ఎడిటోరియల్ ప్రచురించింది. హిందూ మహాసముద్రంపై తమను కట్టడి చేసేందుకు అమెరికా యత్నిస్తోందని చైనా ఆరోపించింది. దీంతోపాటు పసిఫిక్ మహా సముద్రంపై తమతో పాటు సమానంగా సాగడానికి భారత్ సహాయం తీసుకోవాలనుకుంటోందని తెలిపింది.
అమెరికా చర్యలన్నీ భారత్ కు వ్యూహాత్మక అవకాశాలుగా కనిపిస్తాయని... వాస్తవానికి దీని వెనుక పెద్ద మాయ ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ ఈ ట్రాప్ లో పడితే, చదరంగంలో పావులా భారత్ మారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్నో అవకాశాలను ఇండియా కోల్పోతుందని తెలిపింది.