: మేం బకాయిలు లేకపోయినా జాబితాలో మా పేరు ఎలా పెడతారు?: విజయవాడ కార్పొరేటర్ దేవినేని అపర్ణ


విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కు తాము చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించినా, తమ పేర్లను మొండి బకాయిదారుల జాబితాలో చేర్చారని కార్పొరేటర్ దేవినేని అపర్ణ ఆరోపించారు. ఈ ఉదయం తన కుమారుడు చందుతో కలసి మీడియాతో మాట్లాడిన ఆమె, విజయవాడ మునిసిపల్ వెబ్ సైట్లో ఉంచిన మొండి బకాయిల జాబితా నుంచి తమ పేర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కు తాము ఎలాంటి బకాయిలూ లేమని ఆమె చెప్పారు. డబ్బంతా కట్టినా తమపై రాజకీయ కక్ష సాధింపు ఆలోచనతోనే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. కాగా, కార్పొరేషన్ ఆన్ లైన్లో ఉంచిన జాబితాలో పలువురు అధికారపక్ష నేతల పేర్లు ఉంచడంతో దాన్ని తొలగించాలన్న ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News