: మేమైతే ఇక కోహ్లీ టీమ్ ను పల్లెత్తు మాట అనం!: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్


రాంచీలో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టులో తమ ఆటగాళ్లెవరూ ప్రత్యర్థి టీమ్ పై నోరు జారబోరని ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వ్యాఖ్యానించాడు. బెంగళూరు టెస్టులో ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగి చర్చనీయాంశమైన నేపథ్యంలో వార్నర్ స్పందించాడు. క్రికెట్ ఆటలో వాగ్వాదాలు మామూలేనని, ఇక మీదట మాత్రం తమ నోరును అదుపులో పెట్టుకుంటామని, రాంచి టెస్టులో తమ ఆటగాళ్లు ఎవరూ పల్లెత్తు మాట అనబోరని, ఇక ఇండియా ఆటగాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సివుందని అన్నాడు. ఇరు జట్లూ క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తాయని భావిస్తున్నానని, డీఆర్ఎస్ పై వివాదం తనకు నిరాశను కలిగించిందని, మూడో టెస్టులో అన్ని వివాదాలూ సద్దుమణుగుతాయని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ప్రశాంతంగా ఉండి బ్యాటింగ్‌ పైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు వార్నర్ తెలిపాడు.

  • Loading...

More Telugu News