: టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు నిరసనగా.. తెలంగాణ బడ్జెట్ ను బహిష్కరించనున్న కాంగ్రెస్!


తెలుగుదేశం శాసనసభ్యులపై తెలంగాణ అసెంబ్లీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బడ్జెట్ ను బహిష్కరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత వారిపై సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కోరాలని, స్పీకర్ అంగీకరించకుంటే, వాకౌట్ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయే వరకూ విపక్ష నేత జానారెడ్డి సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలను తీసుకున్నారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం మనకేంటని కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ పై తమ వైఖరి ఏంటో తెలియజేస్తామని కొద్దిసేపటి క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడూ ఉంటేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News