: ఆరోగ్యానికి మంచిది కదా అని క్యారెట్‌ను బాగా లాగించేస్తున్నారా?.. జాగ్రత్త ఈ సమస్యలొస్తాయి!
ఆరోగ్యానికి క్యారెట్ ఎంతో మంచిదని చాలామంది విశ్వాసం. అందుకనే దానిని ఎక్కువ మొత్తంలో లాగించేస్తుంటారు. ఆరోగ్యానికి క్యారెట్ మంచిదైనా అతిగా తింటే అనర్థదాయకమేనని అంటున్నారు నిపుణులు. క్యారెట్‌ను ఎక్కువగా తినడం వల్ల రాత్రుళ్లు సరిగా నిద్రపట్టకపోవడం, ఆందోళన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు క్యారెట్ తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. వారు క్యారెట్‌ను ఏ విధంగా తీసుకున్నా ముప్పేనని హెచ్చరిస్తున్నారు. క్యారెట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల తల్లిపాల రుచి మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇక మధుమేహం, హార్మోన్ల సమస్యలతో బాధపడేవారు వైద్యుడి సలహా మేరకే క్యారెట్ తీసుకోవాలని సూచిస్తున్నారు.