: వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు బోరున ఏడ్చాను!: జేసీ ప్రభాకర్ రెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు బోరున ఏడ్చిన మాట నిజమేనని టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ అంటే తనకు చాలా ఇష్టమని, తానంటే ఆయన కూడా ఇష్టపడేవారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజున ఆ బాధ తట్టుకోలేకపోయానని, ఒక మంచి స్నేహితుడిని, ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాననే బాధను భరించలేకపోయానని అన్నారు. తనకు కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయని, అందరూ, అనుకున్నట్లు తానేమీ కర్కశంగా ఉండనని ఒక ప్రశ్నకు సమాధానంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.