: లోకేశ్ ఈజ్ వెరీ యంగ్ మ్యాన్ .. జగన్ రాజకీయాలకు పనికిరాడు!: జేసీ ప్రభాకర్ రెడ్డి
‘లోకేశ్ ఈజ్ వెరీ యంగ్ మ్యాన్ .. జగన్ రాజకీయాలకు పనికి రాడు’ అని తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు పై విధంగా ఆయన సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి అని, ఆప్యాయత ఉన్న మనిషి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, చిరంజీవి, పవన్ కల్యాణ్ లు సినిమా యాక్టర్లు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులుగా పరిటాల రవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘అన్ ఫిట్’ అని చెప్పిన ఆయన, ‘వైఎస్ రాజారెడ్డి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘అబ్బే..అబ్బే’ అంటూ తప్పించుకోవడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి విజన్ ఉంది కానీ, ‘వేస్ట్’ అని అన్నారు.