: వాళ్లిద్దరూ మా కన్నా బాగా కలిసి ఉంటారు!: జేసీ ప్రభాకర్ రెడ్డి


అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘రాజకీయంగా జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి రామలక్ష్మణుల్లా ఉంటారు. మీ మధ్య విభేదాలు తీసుకువచ్చేందుకు ఎవరూ ప్రయత్నించలేదా?’ అనే ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి సమాధానమిస్తూ, ‘ఇప్పుడు.. మా ఇద్దరి మధ్య విభేదాలంటే.. మా ఇంట్లో ఆడవాళ్లు చేయాల్సిందే. నా భార్య కానీ, మా వదిన కానీ.. వాళ్లిద్దరూ మా కంటే బాగా కలిసి ఉంటారు’ అని తనదైన శైలిలో ఆయన చెప్పారు.

‘ఈ సారి ఎన్నికల్లో మీరు డబ్బులు ఇవ్వకుండా గెలిచే పరిస్థితి ఉందా?’ అనే ప్రశ్నకు ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ.. ‘మంచి ప్రశ్న అడిగావు. ప్రజలు ఎలాంటి వాళ్లో కనుక్కోవాలనే కోరిక నాకు ఉంది. ఎందుకు ట్రై చేయకూడదు?’ అని అన్నారు. 

  • Loading...

More Telugu News