: ఓటమికి అఖిలేశ్ మాత్రమే కారణం కాదు!: ములాయం సింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పరాభవం పాలవడానికి ఒక్క అఖిలేశ్ యాదవ్ మాత్రమే కారణం కాదని ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ సమర్థించుకున్నారు. లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీలో తమ పార్టీ విఫలమవడానికి, ఏ ఒక్కరూ కారణం కాదని, ప్రజలను మెప్పించలేకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. అంతకుముందు, ములాయం సోదరుడు శివ్ పాల్ యాదవ్ మాట్లాడుతూ, పార్టీ పరాజయం పాలవడంపై తీవ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.