: మోదీ పాలనను ప్రజలు ఆమోదించారు!: అమిత్ షా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకు మద్దతు ఇచ్చి, మోదీ పాలనను ప్రజలు ఆమోదించారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ప్రజలు బీజేపీకు పట్టం కట్టారని, నాలుగింట మూడో వంతు మెజారిటీతో తమ పార్టీ విజయం సాధించిందని అన్నారు. 1947 తర్వాత ఇది భారీ విజయమని, మణిపూర్, గోవాలోనూ బీజేపీకి ప్రజలు మద్దతు ఇచ్చారని, పేదలు, దళితులు, పీడితులు, రైతుల ప్రభుత్వం తమదని అన్నారు. దేశంలో రెండు కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని, దేశంలో 5 కోట్ల మందికి రాయితీ గ్యాస్ సిలిండర్లు అందించామని, దేశంలోని 16 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.