: కొత్త కాంప్లిమెంట్ ఓ బూస్ట్ లా పని చేస్తుంది: గాయని గీతా మాధురి
ఎన్ని కాంప్లిమెంట్స్ విన్నా, ఎప్పటికప్పుడు ఓ కొత్త కాంప్లిమెంట్ ఓ బూస్ట్ లా పని చేస్తుందని ప్రముఖ గాయని గీతా మాధురి చెప్పారు. 2012 సంవత్సరానికి గాను ఉత్తమ నేపథ్య గాయనిగా నంది అవార్డు అందుకోనున్న ఆమె ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటి నుంచి తన కెరీర్ కోసం తనతో పాటు తల్లి కూడా వస్తుండేవారని, ఆమెతో చనువు ఎక్కువేనని చెప్పారు. తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఏ విషయమూ తన తల్లికి తెలియకుండా ఉంచలేదని, ప్రతి విషయాన్ని ఆమెతో షేర్ చేసుకుంటానని..తనకు ఎవరైనా ప్రపోజ్ చేసిన విషయాన్ని కూడా చెప్పేసేదానినని గీతా మాధురి నవ్వుతూ అన్నారు.