: మా కుటుంబంలో ఓ సభ్యుడిని కోల్పోయాం: వైఎస్ జగన్


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రేపు జరగనున్న భూమా అంత్యక్రియలకు జగన్ కుటుంబసభ్యులు హాజరుకానున్నట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News