: భూమా మృతి పట్ల సంతాపం ప్రకటించిన చంద్రబాబు
కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విస్మయం వ్యక్తం చేశారు. భూమా మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఆయన లోటు పూడ్చలేనిదని పేర్కొంటూ, సంతాపం ప్రకటించారు. టీడీపీ తన కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని ఆయన అన్నారు. భూమా నాగిరెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. భూమా మృతిపై పలువురు మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నట్టు కామినేని శ్రీనివాస్ తెలిపారు.