: ఫలించని ప్రయత్నం... కన్ను మూసిన భూమా నాగిరెడ్డి!


కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు. నేటి తెల్లవారు జామున తీవ్ర గుండెపోటుతో బాధపడ్డ ఆయనను హుటాహుటీన అనుచరులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యలు చికిత్స అందించినా ఆయన శరీరం స్పందించకపోవడంతో ఆయన కన్నుమూసినట్టు ప్రకటించారు. మూడుసార్లు ఎంపీగా పని చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతు దారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

  • Loading...

More Telugu News