: చికిత్సకు భూమా స్పందించడం లేదు!


నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పరిస్థితి చాలా విషమించింది. ఆయన శరీరం చికిత్సకు స్పందించడం లేదని వైద్య వర్గాలు తెలిపాయి. భూమా నాగిరెడ్డికి ఈ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో నంధ్యాలలోని సురక్షా ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. భూమా నాగిరెడ్డికి గతంలో రెండు సార్లు గుండెపోటు వచ్చిందని, బైపాస్ సర్జరీ కూడా జరిగిందని వైద్యులు తెలిపారు. మూడు నెలల క్రితమే స్వల్ప గుండెపోటు రాగా ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు.

కాగా, ఆయన్ను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వైద్యులు చెప్పారు. మరోవైపు భూమా అనుచరులు, టీడీపీ కార్యకర్తలు భారీగా కర్నూలులోని సురక్షా ఆస్పత్రికి తరలివస్తున్నారు. భూమా విషయంలో వినకూడని వార్త వినే అవకాశం ఉందన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. శనివారమే భూమా నాగిరెడ్డి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలసి సీఎం చంద్రబాబును కలసి వెళ్లారు. 

  • Loading...

More Telugu News