: 46 మంది అటార్నీ జనరల్స్ కు షాక్ ఇచ్చిన ట్రంప్!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అడ్డం వస్తారని భావించిన వారినెవరినీ ముఖ్యపదవుల్లో కొనసాగించడం లేదు. ఆ క్రమంలో తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ నిషేధం విధించిన వేళ... తన ఉత్తర్వులు కోర్టు ముందు నిలవకపోవడానికి కారణం న్యాయవాదుల అసమర్థతే అని భావించిన ట్రంప్ ప్రభుత్వం సుమారు 46 మంది అటార్నీ జనరల్స్ ను రాజీనామా చేయాలని కోరింది. ఈ  46 మందిలో భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్ ప్రీత్ బ్రార్ కూడా ఉండడం విశేషం. వీరంతా ఒబామా హయాంలో నియమితులయ్యారు. జార్జ్ బుష్, బిల్ క్లింటన్ హయాంలో కూడా ఇలాగే అటార్నీ జనరల్స్ ను రాజీనామా చేయాలని కొరినట్టు ట్రంప్ ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది.  

  • Loading...

More Telugu News