: ఆర్కే నగర్ లో పోటీకి సై అంటున్న విజయ్ కాంత్!


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌ నియోజకవర్గంలో పాగావేసేందుకు తమిళ పార్టీలన్నీ తమ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జయలలిత వారసురాలినంటూ ఆమె మేనకోడలు దీప్ పోటీకి సై అనగా, జయలలిత ఆశయాలు సాధించే వ్యక్తినంటూ పన్నీరు సెల్వం, పళనిస్వామి కూడా పార్టీ అభ్యర్థులను నిలబెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్ధానంలో విజయం సాధించడం ద్వారా జయలలిత మద్దతుదారులు శశికళ వెంట లేరని నిరూపించాలని మరోపకాక్ డీఎంకే భావిస్తోంది.

ఈ నేపథ్యంలో తాము కూడా పోటీకి సిద్ధమంటూ డీఎండీకే పార్టీ కూడా సై అంటోంది. ఆర్కేనగర్ బరిలో ఒంటరి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ తెలిపారు. గతంలో అరవకుర్చి, తంజావూరు, తిరుప్పరంకుండ్రం ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఘోరపరాజయం పొంది, డిపాజిట్ కూడా కోల్పోయింది. అయినాసరే నిరాశచెందని విజయకాంత్ పార్టీ కార్యకర్తల్లో భేదాభిప్రాయాలు రూపుమాపేందుకు జిల్లాల వారిగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ ఆర్కే నగర్ బరిలో ఉందని, స్పష్టం చేశారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఉత్తర చెన్నై డీఎండీకే కార్యదర్శి మదివానన లేదా, అబ్దుల్లాను బరిలో దించనున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News