: ఏటీఎంలలో డబ్బుల్లేవు... చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు
దేశ ప్రజలను కరెన్సీ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. నవంబర్ 8 నుంచి ప్రారంభమైన కరెన్సీ కష్టాలు ఇంకా పూర్తి స్థాయిలో వీడలేదు. తాజాగా బ్యాంకుల ముందు ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రధాన పట్టణాల్లోని ఏటీఎంలన్నీ పని చేయడం లేదు. దీనికితోడు మూడు రోజులు వరుస సెలవులు కావడంతో మరోసారి ప్రజలు నగదు ఇక్కట్ల బారినపడ్డారు. నగదు కష్టాలపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అకౌంట్లలో డబ్బులున్నా అవసరానికి అక్కరకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.