: చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు.. దుష్టశక్తులకు పరాభవం తప్పదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుక ప్రతి తెలుగు ఇంట సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. దుష్టశక్తులు ఎన్నడూ విజయం సాధించలేవనడానికి హోలీ వేడుక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రహ్లాదుడిని అంతమొందించాలనుకున్న హిరణ్య కశిపుడి సోదరి హోలిక తానే మంటల్లో ఆహుతైందన్నారు. ప్రకృతితో మమేకమైన ఈ వేడుకలో కృత్రిమ రంగులు వాడొద్దని, సహజ రంగులనే ఉపయోగించాలని పిలుపునిచ్చారు.