: గోవా ప్రజలు తప్పు చేశారు...ఐదేళ్లు పశ్చాత్తాపం పడతారు: రాజీనామా చేసిన బీజేపీ సీఎం
గోవాలో ఊహించని ఫలితాన్ని చవిచూసిన గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రజల నిర్ణయాన్ని తప్పు పట్టారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గోవాలో ఏ పార్టీకి పూర్తి స్థాయి ఆధిక్యం రాని నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కూడా రేసులో ఉందని అన్నారు. గోవా ప్రజలు తమ పార్టీకి రెండో ప్రాముఖ్యతనిచ్చి తప్పు చేశారని అన్నారు. దీనికి వచ్చే ఐదేళ్ల పాటు గోవా ప్రజలు పశ్చాత్తాప పడతారని ఆయన పేర్కొన్నారు. కాగా, గోవాలో అధికారం చేపట్టేందుకు 21 స్థానాలు సాధించాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు, బీజేపీకి 13 స్థానాలను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు గెలిచిన ఎన్సీపీ, నాలుగు స్థానాలు గెలుచుకున్న స్వతంత్రులు కింగ్ మేకర్లు గా రూపొందిన సంగతి తెలిసిందే.