: ఇక అయోధ్యలో రామమందిరం కట్టండి!: బీజేపీకి శివసేన సూచన
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా 325 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ, బీజేపీకి అభినందనలు తెలుపుతూ, రామ మందిరం అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ సందర్భంగా శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇక త్వరలో అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తారని తాము ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో అకాలీ-భాజపా కూటమి ఓడిపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఆ రాష్ట్ర ఓటర్లు మార్పును కోరుకున్నారని, అందుకే ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని అన్నారు.