: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఒవైసీకి భంగపాటు


ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏఐఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ 38 స్థానాల్లో త‌మ‌ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ పార్టీ అభ్య‌ర్థులు క‌నీసం ఒక్క‌ స్థానంలో కూడా గెలవ‌లేక‌పోయారు. నాలుగుసార్లు ఎంపీ అయిన షఫీక్‌ ఉర్‌ రెహ్మాన్‌ బర్క్‌ మనవడు, ఏఐఎంఐఎం పార్టీ అభ్య‌ర్థి జియావుర్‌ రెహ్మాన్‌ బర్క్‌ కూడా ఓటమి పాలయ్యారు. ఓట‌మిపై స్పందించిన అస‌దుద్దీన్ తాము ఇంకా యుద్ధం నుంచి తప్పుకోలేదని వ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్తులో మ‌రింత తీవ్రంగా ఎన్నికల్లో పోరాడుతామని తేల్చి చెప్పారు.

ఈ రోజు జ‌మ్ముక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఆకాశానికెత్తేసిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌త్య‌ర్థి పార్టీలు కేంద్రంలో 2019 ఎన్నిక‌ల కోసం కాకుండా 2024 ఎన్నిక‌ల కోసం ప్ర‌ణాళిక‌లు వేసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఒమ‌ర్ అబ్దుల్లా వ్యాఖ్యల‌పై స్పందించిన అస‌దుద్దీన్ ఒవైసీ... ఆయ‌న మాటలు యుద్ధం ప్రారంభం కాకముందే పారిపోవాలనే విధంగా  ఉన్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News