: విజయోత్సాహంతో రేపు భారీ సభ నిర్వహించనున్న బీజేపీ
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వం నెలకొల్పబోతున్న భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అదే ఊపుతో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో రేపు విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు. అలాగే రేపు సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలనే అంశంతో పాటు మణిపూర్, గోవాలో తమ ప్రభుత్వాల ఏర్పాటుకు అనుసరించాల్సిన ప్రణాళిక గురించి చర్చించనున్నారు.