: సినీ నిర్మాత దిల్ రాజు భార్య మృతి... అమెరికా నుంచి బయలుదేరిన దిల్ రాజు!
గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత (46) కన్నుమూశారు. కాగా, దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఫిదా' చిత్రం షూటింగ్ నిమిత్తం ఆయన అక్కడ ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దిల్ రాజు అక్కడి నుంచి హుటాహుటీన హైదరాబాద్ కు బయల్దేరారు. దిల్‌రాజు నిర్మించిన చిత్రాలన్నింటికీ అనితారెడ్డి సమర్పకురాలిగా వ్యవహరించారు.