: ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను: ఘోర పరాజయంతో ఇరోమ్ షర్మిల ఆవేదన
మణిపూర్‌లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోన్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ 16 ఏళ్ల పాటు నిరాహారదీక్ష చేసిన ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల కొన్ని నెలల క్రితమే రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు వెల్లడైన ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన ఆమె, ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఆ రాష్ట్ర ప్రజల కోసం 16 ఏళ్లుగా పోరాడిన ఆమెకు కేవలం 90 ఓట్లే రావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనకు మద్దతు తెలపలేదని ఆవేదన చెందుతున్నట్టు సమాచారం.