: శుభాకాంక్షల వెల్లువ.. మోదీకి ఫోన్ చేసిన చంద్రబాబు.. లేఖ రాసిన కేసీఆర్


ఉత్త‌రప్ర‌దేశ్‌లో ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించి భారీ విజ‌యంతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. మరోవైపు ఉత్త‌రాఖండ్‌లోనూ ఆ పార్టీ విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌రేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి జరిపే వారికే ప్రజలు ఓట్లు వేశారని చంద్రబాబు ఈ సందర్భంగా మోదీతో అన్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా మోదీకి లేఖ రాశారు. ప్రధానికి శుభాకాంక్ష‌లు తెలుపుతూ మరింత సమర్థంగా ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్లాలని అందులో కేసీఆర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీని బలపరుస్తూ ప్రజలు ఈ తీర్పునిచ్చారని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News