: ఓటమిని అంగీకరిస్తున్నాం.. రానున్న ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి: అఖిలేష్
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి శుభాకాంక్షలు చెబుతున్నామని... రానున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సరైన నిర్ణయమేనని... తమ స్నేహం ఇకపై కూడా కొనసాగుతుందని తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈవీఎంల ట్యాంపరింగ్ పై చేసిన ఆరోపణల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు.