: ఐదు రాష్ట్రాల ఎన్నికలు... ఇప్పటి దాకా గెలుచుకున్న సీట్ల సంఖ్య
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. యూపీ, ఉత్తరాఖండ్ లో బీజేపీ సత్తా చాటగా, పంజాబ్ 'హస్త'గతం అవుతోంది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో హంగ్ దిశగా ఫలితాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రంలో ఏయే పార్టీ ఇప్పటి వరకు ఎన్ని సీట్లు గెలుచుకుందో ఓ లుక్కేద్దాం.
ఉత్తరప్రదేశ్ (మొత్తం సీట్లు-403):
బీజేపీ - 317, సమాజ్ వాదీ +కాంగ్రెస్ - 55, బీఎస్పీ - 19, ఇతరులు - 5.
ఉత్తరాఖండ్ (70):
బీజేపీ - 40, కాంగ్రెస్ - 10, ఇతరులు 1.
పంజాబ్ (117):
కాంగ్రెస్ - 69, అకాలీదళ్+బీజేపీ - 17, ఆప్ - 20, ఇతరులు - 2.
గోవా (40):
బీజేపీ - 12, కాంగ్రెస్ - 14, ఇతరులు - 9.
మణిపూర్ (60):
కాంగ్రెస్ - 21, బీజేపీ - 18, ఎన్పీఎఫ్ - 3, ఇతరులు - 5