: చంద్రబాబు మనసు నొప్పించి ఉంటే నన్ను క్షమించండి: 'ధర్మవరం' గొడవపై టీడీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ
అనంతపురం జిల్లా ధర్మవరంలో విద్యుత్ కేబుల్ లాగే విషయంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూర్యనారాయణ వర్గీయుల మధ్య నిన్న గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎమ్మెల్యే సూర్యనారాయణ స్పందించారు. ఈ వివాదం కారణంగా తమ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడి మనసు నొప్పించి ఉంటే తనను మన్నించాలని ఆయన అన్నారు. తమ అనుచరులను పరిటాల వర్గీయులు అన్యాయంగా కొట్టారని ఈ రోజు ఎస్పీ కార్యాలయం ఎదుట సూర్యనారాయణ నిరసన తెలిపి వినతిపత్రం ఇచ్చారు. చంద్రబాబు నాయుడి ఆదేశాలను కొందరు బేఖాతరు చేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని అన్నారు. తమ వర్గీయులకు తగిలిన గాయాలు చూసి తట్టుకోలేకే తాను స్పందించానని అన్నారు.