: ఓటమితో నిరాశ.. కేజ్రీవాల్ నివాసం నుంచి చీపుర్లను తరలించిన పార్టీ శ్రేణులు!


గ‌తంలో ఢిల్లీలో సాధించిన విజ‌యంతో ఉత్సాహంతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇటీవ‌ల‌ పంజాబ్‌, గోవాల్లో జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాల్గొన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు వెలువ‌డిన ఫలితాల్లో ఆ పార్టీకి గోవాలో ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. మ‌రోవైపు  పంజాబ్‌లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయం బోసిపోయి క‌నిపిస్తోంది.

కాగా, ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉదయం ఉంచిన ఆప్‌ ఎన్నికల గుర్తు చీపుర్లను ఆ పార్టీ శ్రేణులు అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఆ దృశ్యం ఓ కెమెరాకి చిక్కింది. ఈ రోజు ఉదయం ఆయన ఇంటి వద్ద భారీగా చీపుర్లు కనిపించాయి. ఫలితాల్లో గెలిస్తే ఆ చీపుర్లను చేతిలో పట్టుకొని పార్టీ నేతలు సంబరాలు చేసుకుందామనుకున్నారట. అయితే, ఫలితాలు తమకు ప్రతికూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు నిరాశచెందుతున్నారు. ఆప్‌ పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్ కూడా ఆ రాష్ట్రంలోని మాన్‌ జలాలాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటమి పాలయ్యారు.

  • Loading...

More Telugu News