: మాకు వచ్చే ఇబ్బందేమీ లేదు: బీజేపీ గెలుపుపై స్పందించిన కేసీఆర్


ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఉత్త‌రప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతోన్న అంశంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్పందించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై త‌మ‌ పార్టీ ముఖ్యనేతలతో ఆయ‌న ఈ రోజు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం వ‌ల్ల తెలంగాణ‌లో త‌మ‌ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. అయితే, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీకి అంశాల వారీగా మద్దతిస్తున్నామని, కీలక రాష్ట్రాల్లో గెలుపొందడం బీజేపీకి కచ్చితంగా పెద్ద విజయమేనని వ్యాఖ్యానించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆ పార్టీ ఓడిపోతే ఆర్థిక సంస్కరణల్లో దేశం వెనకబడేదని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News