: గవర్నర్ ప్రసంగంలో ఒక్క వాక్యం కూడా తప్పులేదు.. ఉంటే రాజీనామా చేస్తా: కేసీఆర్


తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభలో గవర్నర్ నరసింహన్ నిన్న ప్రసంగించిన విషయం తెలిసిందే. అయితే ఆయ‌న ప్ర‌సంగంలో చెప్పిన విష‌యాలు త‌ప్పుల త‌డ‌క‌గా ఉన్నాయ‌ని విప‌క్ష స‌భ్యులు చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఈ రోజు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ఒక్క వాక్యం కూడా తప్పులేదని ఆయ‌న చెప్పారు. అందులో అబద్ధాలు ఉంటే త‌న‌ పదవికి రాజీనామా చేస్తానని ఉద్ఘాటించారు. ఈ రోజు జ‌రుగుతున్న‌ గవర్నర్‌ ప్రసంగంపై చర్చలో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు పాల్గొనకపోవడం బాధాక‌ర‌మ‌ని అన్నారు.

తెలంగాణ‌లో నిర్మిస్తోన్న‌ ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లపైనా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నిరాధార‌ ఆరోపణలు చేస్తున్నార‌ని కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అవినీతి చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆయ‌న అన్నారు. అలాగే, కొంద‌రు స్వార్థ‌ప‌రులు చేస్తోన్న‌ మాటలను నిరుద్యోగులు న‌మ్మ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ‌లో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News